Monday, April 15, 2024

వీడియో: గద్వాలలో పవన్ ఫ్యాన్స్ వీరంగం

ఇప్పుడంతా వకీల్ సాబ్ మేనియా నడుస్తోంది…అభిమాన హీరో మూడేళ్ల తర్వాత సినిమా చేస్తే, ఓ పవర్‌ ఫుల్‌ సందేశాత్మక చిత్రంతో వస్తే ఇక థియేటర్లలో పూనకమే. బాక్సాఫీస్‌ షేక్‌ కావాల్సిందే. అందులోను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలిసిందే. తమ అభిమాన హీరో మూవీని తొలి రోజు మొదటి ఆట చూడాలని ఫ్యాన్స్ కి ఉంటుంది. అయితే అనుకున్న సమయానికి బొమ్మ పడకపోతే అభిమానుల ఆవేశాన్ని ఆపడం ఎవరి తరంకాదు. తాజాగా గద్వాల జిల్లాలో అదే జరిగింది. గద్వాల జిల్లాలోని శ్రీనివాస థియేటర్ లో పవన్ అభిమానులు వీరంగం సృష్టించారు. మూవీకి అంతరాయం ఏర్పడటంతో అభిమానులు ఆందోళనలు చేశారు. థియేటర్ తలుపులను ధ్వంసం చేశారు. కుర్చీలను పలుగొట్టారు. అభిమానుల కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement