Wednesday, April 17, 2024

‘కోలో కోలన్న కోలో’ అంటున్న నేచురల్ స్టార్

నేచురల్ స్టార్‌ నాని నటించిన‘టక్‌ జగదీష్‌’నుంచి తాజాగా ‘కోలోకోలన్నకోలో కొమ్మ‌లు కిల‌కిల న‌వ్వాలి’ అంటూ సాగే లిరికల్ పాట‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా, ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. నాని, శివ నిర్వాణ కాంబినేషన్‏లో వ‌స్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement