Monday, May 29, 2023

యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం ఉదయం పటాన్ చెరు శాసనసభ్యులు జీఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల కోసం క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, చంద్రశేఖర్, ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు పృథ్వీరాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement