Friday, April 26, 2024

వెంకయ్యనాయుడు అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జ్..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది ట్విట్టర్. అయితే… వివాదం సద్దుమణిగిపోతుందని మాత్రం అనుకోలేం. అసలేమైందంటే… ఈ ఉదయం వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి ఉన్న బ్లూ బ్యాడ్జిని తొలగించింది ట్విట్టర్. ఈ బ్యాడ్జి ఉంటేనే… అది నిజమైన అకౌంట్ అని నెటిజన్లు గ్రహించగలరు. బ్యాడ్జ్ లేని అకౌంట్ నిజమైనదో, నకిలీదో గుర్తించడం కష్టం. అందువల్ల బ్యాడ్జ్ తొలగించడంపై పెద్ద దుమారం రేగింది. ట్వట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని గమనించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం… ఎందుకు తొలగించారని ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దాదాపు ఏడాది కాలంగా… ఆ ఎకౌంట్ యాక్టివ్‌గా లేదనీ…అందువల్లే బ్యాడ్జి తొలగించామని ట్విట్టర్ చెప్పింది. ఐతే… వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక… తన సమాచారం అంతా… అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ… అంత మాత్రాన… యాక్టివ్‌గా లేనట్లు కాదని… చెప్పడంతో… ట్విట్టర్… తన తప్పును సరిచేసుకుంది. మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement