Friday, June 18, 2021

కరోనాతో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మృతి

కరోనా బారినపడి దేశంలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండగా.. ఈ జాబితాలో సామాన్యుల దగ్గరి నుండి సెలబ్రెటీలు, గ్యాంగ్‎స్టర్లు కూడా ఉంటున్నారు. తాజాగా కరోనా బారినపడి అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మృతి చెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా చికిత్స పొందుతున్న ఛోటా రాజన్.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తీహార్ జైలులో ఎంతో పటిష్టమైన భద్రత మధ్య ఉన్న ఛోటా రాజన్ అండర్ వరల్డ్‌ను కొన్ని దశాబ్దాల పాటు శాసించాడు.

ముంబై బాంబు దాడులతో సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్.. ఏప్రిల్ 26న కరోనా వల్ల కోర్టుకు హాజరుపర్చలేమని జైలు అధికారులు వెల్లడించారు. కాగా మొత్తం 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఛోటా రాజన్‌పై ఉన్న అన్ని అభియోగాలపై సీబీఐ విచారణ జరుపుతోంది. కాగా దేశంలో ఇప్పటికే చాలామంది గ్యాంగ్‎స్టర్లు కరోనా వల్ల చికిత్స పొందుతూ మృతి చెందడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News