Friday, April 19, 2024

ఈ నెల 28న గ్రాండ్ గా విడుదలకానున్న ఫోకస్ మూవీ ..ట్రైలర్ రిలీజ్ చేసిన శ్రీకాంత్

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్నచిత్రం ఫోకస్. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నఈ చిత్రానికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు, వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మాత‌. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవ‌ల విడుద‌లైన ఫోక‌స్ మూవీ టీజ‌ర్ ఐదు ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొద‌టిసారిగా పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. అక్టోబ‌రు 28న ఈ మూవీ థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా…

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..ఫోకస్ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. హీరో విజ‌య్ శంక‌ర్ చాలా బాగా పెర్‌ఫామ్ చేశాడు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ నెల 28న థియేట‌ర్లో విడుద‌ల‌వుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాతో నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ వీరభ‌ద్ర‌రావు గారికి, మిగతా టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ..నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఫోకస్. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసిన శ్రీకాంత్ అన్న కి చాలా థాంక్స్. ఈ మూవీ కంప్లీట్ క్రైమ్ థ్రిల్ల‌ర్. ఈ జోన‌ర్‌ని ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. అంత చ‌క్క‌గా డైరెక్ట‌ర్ సూర్య‌తేజ‌గారు ఈ సినిమాని డిజైన్ చేశారు. అక్టోబ‌రు 28న విడుదలవుతున్న ఫోకస్ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటునని చెప్పారు. ఈ నెల 28న విడుదలవుతున్న ఫోకస్ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటునని తెలిపారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌ తదితరులు నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement