Saturday, April 20, 2024

కాలనీలకు సౌకర్యాలు కల్పించాలి – కలెక్టర్ నివాస్

శ్రీకాకుళం, : జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇళ్ళ కాలనీలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను సూచించారు. కాలనీల మౌళిక సదుపాయాల కల్పనపై సమన్వయ సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శని వారం జరిగింది. ఇళ్ళ నిర్మాణాలకు నీటి సరఫరా అవసరమని అందుకు బోర్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ కనెక్షన్ కల్పనకు అవసరమగు అంచనాలు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల కార్యదర్శులు ఆన్ లైన్ లో కాలనీలకు కావలసిన విద్యుత్ కనెక్షన్ ల కొరకు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నాటికి కాలనీలకు విద్యుత్ కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నమోదు చేసిన కాలనీల విద్యుత్ కనెక్షన్లకు అంచనాలు తయారు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాసరావు, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్, ప్రజారోగ్య విభాగం కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇపిడిసిఎల్, గృహ నిర్మాణ సంస్ధ కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement