Thursday, March 28, 2024

వ్యాక్సిన్‌ తీసుకున్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు..

షాద్‌ నగర్‌ : రెండో దశలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనాపై యుద్దానికి ఎవరికి వారుగా సిద్దం కావాల్సిన అవసరం ఎంతైన ఉందని దీనికి వ్యాక్సిన్‌ పరిష్కర మార్గమని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సరాపు రమేష్‌ కుమార్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సరాపు రమేష్‌ కుమార్‌ మిడియాతో మాట్లాడారు. కరోనా ప్రారంభంలో అప్రమత్తంగా ఉండి వ్యాప్తి తగ్గగానే ఇంకేమికాదు అన్నట్లు చాలా మంది నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను సమర్థవంతంగా ఎందుర్కోవాలంటే మనకు ఉన్న ఆయుధాలు వ్యాక్సిన్‌, మాస్కేనని సృష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న మాస్క్‌ ధరించడం ఇతర జాగ్రత్తలు పాటించడం తప్పని సరని పేర్కోన్నారు. గతంలో ఒకరికి పాజిటివ్‌ వస్తే వారి క్లోజ్‌ కాంటాక్ట్స్‌ పది మందిలో ఇద్దరికే సోకగా రెండో దశలో మాత్రం ఏడుగురికి సోకుతుందని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సిన్‌ తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలు వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని మే 1 నుండి ప్రభుత్వాలు 18-44 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్‌లు ఇస్తుండటం శుభ పరిణామం అని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement