Tuesday, March 26, 2024

వెదర్ అలర్ట్: తెలంగాణలో 4 రోజులు వర్షాలే!

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డితో పాటు వరంగల్, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది.

మరోవైపు హైదరాబాద్ లో అర్థరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గాలి, వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో రాత్రంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

ఇది కూడా చదవండి: ‘బ్లాక్ ఫంగస్‌’ కేసులపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement