Tuesday, April 16, 2024

‘పుష్ప’సర్‌ప్రైజ్ .. ఫ్యాన్స్ బి రెడీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమాగా ‘పుష్ప’ తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఆగస్టు 13న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న ఫస్ట్ గ్లింప్స్ గానీ టీజర్ గానీ రాలేదు. ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆ సర్‌ప్రైజ్ రాబోతున్నట్టు సమాచారం.

ఇక, ఈ వారం ‘పుష్ప’ చిత్రం నుంచి అనేక అప్ డేట్స్ వస్తున్నాయని, అభిమానులు సిద్ధంగా ఉండాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. “లోడు దింపతండాం” అంటూ చిత్తూరు యాసలో ఉన్న ఓ పిక్ ను పంచుకుంది. ఈ వారం బన్నీ అభిమానులకు పండగేనని పేర్కొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కొత్త అప్ డేట్ ఇవ్వనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ .. లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే ఆయన స్మగ్లర్ గా మారడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందట. అదేమిటనేది ఇప్పుడు బన్నీ అభిమానులలో ఆసక్తిని రేకేస్తోంది. అడవి నేపథ్యంలో సాగే కథ .. బన్నీ లుక్ ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఏప్రిల్ 8వ తేదీన బన్నీ పుట్టినరోజు. ఆ రోజున ‘పుష్ప’ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా స్పెషల్ ట్రీట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement