Thursday, April 25, 2024

నా పెన్సిల్ పోయింది..కేసు పెట్టండి .. పోలీసులు ఏం చేశారో తెలుసా ..

పోలీసులు ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కోసం ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అలా అని ప్ర‌తి చిన్న విష‌యానికి పోలీస్ స్టేష‌న్ కి వెళ్లితే ఎలా..ఈ మ‌ధ్యకాలంలో కొన్ని సిల్లీ కేసులు కూడా వ‌స్తున్నాయి. గేదె పాలు ఇవ్వడం లేదని… దెయ్యం తిరుగుతుందని.. కొంత మంది పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.ఇప్పుడు ఏకంగా త‌న పెన్సిల్‌ పోయిందని కొంత మంది చిన్నారులు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పెదకడుబూరు లో చోటు చేసుకుంది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ ను తోటి విద్యార్థి దొంగతనం చేశాడంటూ…. పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చాడు. ఆ విద్యార్థి పై పోలీస్‌ కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. అయితే.. దీనిపై స్పందించిన పోలీసులు.. ఆ బాలుడికి నచ్చ జెప్పి.. అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఈ ఘటన కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement