Tuesday, April 23, 2024

Nara lokesh: ఏపీ పోలీసులు వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా?

ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారని పేర్కొన్నారు. మా టిడిపి కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటరావు కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలా అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్ట్ ల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలి అని అన్నారు. చట్టాలని గౌరవిస్తున్నామని …పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement