Friday, May 27, 2022

రైతులను మోసం చేస్తున్న మోడీ, కేసీఆర్ : ఉత్త‌మ్

మోడీ, కేసీఆర్ లు కలిసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కర్షకుల కోసం కాంగ్రెస్‌ అంటూ ఈరోజు కాంగ్రెస్‌ వరి దీక్షలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద వరి దీక్షలు చేపట్టింది. ఈసంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ… దేశంలో, రాష్ట్రంలో 50 నుండి 60 శాతం జనాభా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్నాయన్నారు.ఆగస్ట్ నెలలో 5కోట్ల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం ఒప్పందం జరిగిందన్నారు. కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు టార్గెట్ పెట్టిందన్నారు. అంటే.. 60లక్షల టన్నుల వడ్లు సేకరించాలి.. కానీ ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు కూడా సేకరించలేదన్నారు. పంజాబ్ లో ఇప్పటికే కోటి 10లక్షల టన్నులు సేకరించిందన్నారు.

మన కంటే చిన్న రాష్ట్రాలు కూడా 40 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నాయన్నారు. వరి రైతులు నష్ట పోవడానికి కేసీఆరే కారణమన్నారు.మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యారన్నారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు, అధికారులు మోసం చేశారన్నారు. ఇక వానలకు తడిసి వడ్లు మొలకలెత్తాయన్నారు. కేసీఆర్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్నారు. రబీ పంటలపై ఆంక్షలు వద్దని, పార్లమెంట్ సమావేశంలో వరి రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అన్ని విధాలుగా కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తుండన్నారు. ఛత్తీస్ ఘడ్ లో వరికి క్వింటాల్ కి 500 బోనస్ ఇస్తుందన్నారు. పంజాబ్ లో కోటి 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అయ్యిందన్నారు. ధనిక రాష్ట్రంలో ఎందుకు రైతులపై చిన్న చూపు చూస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ, పంట బీమా ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తుండని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement