Friday, March 29, 2024

ఆచార్య పై అభిమానులకు అనుమానం స్టార్ట్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా నుంచి ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ సిద్ధ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక పోస్టర్ విషయానికి వస్తే ఆ పోస్టర్ లో చిరుతో పాటు రామ్ చరణ్ తుపాకీ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తున్నారు.

నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ ఫోటోను చూసి కొంత మంది అభిమానులు ఖుషి గా ఫీల్ అవుతున్నప్పటికీ మరికొంతమంది అభిమానులు భయపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం నక్సలిజం, కామ్రేడ్ యాంగిల్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించటం లేదు. ఇటువంటి సమయంలో ఆచార్య వర్కవుట్ అవుతుందా అనే భయం అభిమానులకు పట్టుకుంది. మరి చిరు ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement