Thursday, November 7, 2024

రీ-రిలీజ్ కానున్న మాసివ్ బ్లాక్ బస్టర్ RRR.. ఆకట్టుకుంటున్న కొత్త ట్రైలర్

దర్శక దిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ అండ్ ఎపిక్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం). వరల్డ్ వైడ్ గా ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ మాస్టర్ పీస్ ఇప్పటికీ ఏదొక సందర్భంలో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూను ఉంది. కాగా, ఇప్పుడు ఈ సినిమా మరో సారి వార్తల్లోకి వచ్చింది. ఈ మాసివ్ బ్లాక్ బస్టర్ మరోసారి యూఎస్ లో రీ-రిలీజ్ కి సిద్ధం అయింది. అయితే ఈ రిలీజ్ కూడా ఏకంగా 200 థియేటర్స్ లో.. అందులోకూడా కంప్లీట్ గా తెలుగు వెర్షన్ లో రిలీజ్ కాబోతుండడం విశేషం.

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటే.. వచ్చే నెల మార్చ్ 3న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అంతే కాకుండా యూఎస్ లోని ఫేమస్ ఏస్ హోటల్ స్క్రీన్ లో కూడా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ మార్చ్ 1 కి ప్లాన్ చేయగా.. దీనికి రాజమౌళి, రామ్ చరణ్, ఎం.ఎం.కీరవాణి ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఈ రీ-రిలీజ్ ని ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన సరికొత్త ట్రైలర్ కట్ కూడా ఔట్ స్టాండింగ్ గా ఉంది. మొత్తానికి ఈ భారీ సినిమా రీ-రిలీజ్ ని అయితే అక్కడి తెలుగు ఆడియెన్స్ సహా ఫారిన్ ఆడియెన్స్ కూడా మరో సారి ఈ వెండితెరపై విట్నెస్ చేసి ఎంజాయ్ చెయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement