Sunday, April 14, 2024

హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్- బిజెపిలో చేరిన కుల్దీప్ బిష్ణోయ్

తాను చెప్పిన విధంగానే బిజెపిలో చేరారు కుల్దీప్ బిష్ణోయ్.. హర్యానా రాజకీయాల్లో జాట్‌యేతర ముఖంగా పరిగణించబడుతున్న కుల్దీప్ బిష్ణోయ్‌పై కొనసాగుతున్న అనుమానాలకు తెరపడనుంది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీతో పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. ఆరేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కొత్త రాజకీయ యాత్రను ప్రారంభించబోతున్నట్లు అడంపూర్‌లో మద్దతుదారుల మధ్య కుల్దీప్ అన్నారు. హర్యానాలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ‘క్రాస్ ఓటింగ్’ కారణంగా, కాంగ్రెస్ అన్ని పార్టీ పదవుల నుండి కుల్దీప్ బిష్ణోయ్‌ను తొలగించిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి, కుల్దీప్ బిష్ణోయ్ బిజెపి నాయకులతో బహిరంగంగా వరుస సమావేశాలను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో.. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పలు దఫాలుగా సమావేశాలు జరిపిన అనంతరం ఆయన ఆదంపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్‌ కుమారుడు కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని అంతా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement