Friday, April 19, 2024

మహారాష్ట్రలో థర్డ్ వేవ్.. ఒక్క జిల్లాలోనే 8 వేల మంది పిల్లలకు వైరస్!

కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిన భారత్ కు ఇప్పుడు థర్డ్‌ వేవ్‌లో టెన్షన్ పట్టుకుంది. కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌ వేవ్ క్రమంగా వ్యాప్తిస్తోంది. దేశంలో కోవిడ్‌ వైరస్‌కు అధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్రను థర్డ్‌ వేవ్‌ కలవరపెడుతోంది. మహారాష్ట్రలోని అహ్మద్ న‌గ‌ర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్‌ సోకింది. దీంతో వారికి చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఐదుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు.

మూడో దశలో కరోనా చిన్నారులను టార్గెట్‌ చేస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో పలు రాష్ట్రాలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాయి. థర్డ్‌వేవ్‌ గురించి స్థానిక కార్పొరేటర్ అభిజిత్ భోశ్లే మాట్లాడుతూ.. మే నెల‌లో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని, థర్డ్‌వేవ్‌ వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైర‌స్ సోకిన చిన్నారుల‌కు చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు జిల్లాలోని చిన్నారుల్లో 10శాతం మందికి కరోనా కేసులు నమోదయ్యాయని అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. థర్డ్‌ వేవ్ నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చిన్న పిల్లల వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే సంగ్రామ్ జగ్తాప్ మాట్లాడుతూ.. ” సెకండ్ వేవ్ సమయంలో పడకలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కాబట్టి, మూడవ దశ సమయంలో మనం దానిని నివారించాలి. థర్డ్‌ వేవ్‌ వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా క్రమంగా తగ్గుతున్నా.. మరణాలు మాత్రం అధిక సంఖ్యలో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఫ్యాక్ట్ చెక్: చికెన్ తో బ్లాక్ ఫంగ‌స్‌ వస్తుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement