Thursday, April 25, 2024

లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసిన ప్రభాస్

నిహారిక బ్యానర్ పై నిర్మితమైన చిత్రం లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు సంతోష్ శోభన్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. అంతకుముందు ఆయన నుంచి వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ .. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ .. ‘ కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన  ‘లైక్ .. షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ సినిమా నుంచి హీరో ప్రభాస్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సమపాళ్లలో సర్దేసిన కథ ఇది అని అర్థమవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ఫరియా అబ్దుల్లా అలరించనుంది. ‘జాతి రత్నాలు’ తరువాత అమ్మడికి ఆ స్థాయి సినిమాలు పడలేదు. ఈ సినిమాతో ఆమెకి హిట్ పడుతుందేమో చూడాలి. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement