Sunday, April 11, 2021

బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ స్ఫూర్తితో కెసిఆర్ పాల‌న‌…మంత్రి కొప్పుల‌

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ బాబూ జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజాం కాలేజీ వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ దళిత్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రాంను కొత్తగా ప్రవేశపెట్టి, బడ్జెట్లో రూ.1,000కోట్లను అదనంగా కేటాయించారని తెలిపారు. జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి ప్రభుత్వం అంకితభావంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తదితరులు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News