Friday, March 29, 2024

ఉక్రెయిన్‌ ఎదురుదాడుల నేపథ్యంలో.. ఖార్కీవ్‌నుంచి రష్యా దళాలు వెనక్కి..

కీవ్ : రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ తాజాగా ఖార్కీవ్‌ ప్రాంతంపై మళ్లి పట్టు సాధించింది. దండయాత్ర ప్రారంభించిన తొలినాళ్లలో రాజధాని కీవ్‌పై ముమ్మరదాడులు చేసిన రష్యా ఆ తరువాత ఎదురుదెబ్బలు తిని, వ్యూహం మార్చుకుని వెనక్కు మళ్లినట్టే ఇప్పుడు ఖార్కీవ్‌నుంచి వైదొలుగుతోందని ఉక్రెయన్‌ వర్గాలు శనివారం ప్రకటించాయి. మరోవైపు డాన్‌బోస్‌ ప్రాంతంలో ఓ నదిని దాడి తాత్కాలిక వంతెన నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న రష్యా బలగాలపై ఉక్రెయిన్‌ విరుచుకుపడింది. వారి ప్రయత్నాలను భగ్నం చేసింది.

రష్యా సరిహద్దుల్లోని కొన్ని గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కీవ్‌, ఖార్కీవ్‌లలో రష్యాను తరిమికొట్టిన ఉక్రెయిన్‌ ఇప్పుడు రష్యా సరిహద్దుల్లోని కీలక పట్టణమైన డాన్‌బోస్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా వ్యూహం మార్చింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంపై ఇ ప్పటికే దాడులు చేస్తున్న రష్యా ఖార్కీవ్‌లో మోహరించిన దళాలను అటువైపునకు తరలిస్తోంది. రష్యాతో యుద్ధం కొత్త దశకు చేరుకుందని, దీర్ఘకాలంపాటు కొనసాగబోతోందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. కాగా ఖేర్సన్‌లో రష్యా పూర్తి పట్టు సాధించింది. తనకు అనుకూలవర్గానికి పాలనాపగ్గాలు అందించింది. అందుకు తగ్గట్టే ఖేర్సన్‌ను రష్యాలో కలిపేయాలంటూ ప్రస్తుత ప్రభుత్వం తీర్మానం చేసినట్లు బ్రిటన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement