Monday, April 15, 2024

కార్తీ#25 ‘జపాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. డ్యుయ‌ల్ రోల్‌పై క్లారిటీ ఇవ్వ‌ని మేక‌ర్స్‌

కొద్దిరోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు కార్తీ 25వ చిత్రం జపాన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. రాజుమురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా న‌టిస్తోంది. కాగా, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇవ్వాల (నవంబర్ 14న) విడుదల చేశారు. జపాన్ ఫస్ట్ లుక్‌లో కార్తీ రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో పడుకుని కనిపిస్తున్నాడు. సోఫా వెనుక గోడపై, గోల్డెన్ ఫ్రేమ్ వేలాడుతూ కనపడుతుంది. అందులో కార్తీ బంగారు చొక్కా, చైన్స్ ని ధరించి, బంగారు తుపాకీ & గ్లోబ్ ని పట్టుకున్నట్లుగా చూపారు.

ఈ చిత్రంలో నటుడు ద్విపాత్రాభినయం చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. కాగా ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేేేయనున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement