Wednesday, February 8, 2023

కేవలం కర్ణాటకలోనే కోటికి పైగా అమ్ముడైన.. కాంతార మూవీ టిక్కెట్స్

హీరోగానే కాకుండా దర్శకుడిగా కాంతార చిత్రాన్ని తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు మాత్రమే బజ్ పెరుగుతూ వెళ్లింది. తొలి ఆటతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు తీయడం మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో థియేటర్లను పలకరించింది. కన్నడ రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా, అక్కడ కూడా తన సత్తాను చాటుకుంది. కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా 200 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమా తాజాగా మరో రికార్టును సొంతం చేసుకుంది. ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టుగా చెబుతూ, మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement