Wednesday, December 11, 2024

Kadapa: రిమ్స్ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం


క‌డ‌ప జిల్లాలోని రిమ్స్ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. మెడిక‌ల్ కాలేజీలో 50మంది విద్యార్థుల‌కు కోవిడ్ పాజిటీవ్ నిర్ధార‌ణ అయ్యింది. ఎన్టీఆర్ వర్సిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈకళాశాలలో రేపు 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కావిడ్ బారినపడగా, మరికొంత మంది విద్యార్థుల నివేదికలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలన్నీ వాయిదా వేయాల‌ని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్సిటీని కోరింది. రేపు ఫైనల్ పరీక్షలు జరగనుండగా కోవిడ్ కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈక‌రోనా కేసులు ఒక్క‌సారిగా ఇంత మందికి రావ‌డంతో విద్యార్థులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఒక వైపు రేపు ప‌రీక్ష‌లు ఉండ‌డం, క‌రోనా కేసులు ఒకేసారిగా ఇన్ని కేసులు న‌మోద‌వ‌డంతో విద్యార్థుల ప‌రిస్థితి అయోమ‌యంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement