Friday, April 19, 2024

లాస్య సీమంతం వేడుక‌లో.. బుల్లితెర సెల‌బ్రిటీలు

యాంక‌ర్ లాస్య సీమంతం వేడుక ఘ‌నంగా జ‌రిగింది. లాస్యకు నెలలు నిండగా కుటుంబ సభ్యులు సీమంత వేడుక నిర్వహించారు. లాస్య ఈ వేడుకకు తన మిత్రులను, సన్నిహితులను ఆహ్వానించారు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ ఈ వేడుకలో సందడి చేశారు. లాస్య సీమంత వేడుక వీడియోను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గీతూ తో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లాస్య సీమంత కార్యక్రమానికి హాజరై ఆమెను ఆశీర్వదించినట్లు సమాచారం.

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య (Lasya) బిగ్ బాస్ షోతో మరింత పాప్యులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. ఇక తోటి కంటెస్టెంట్స్ తో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. అయితే ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకడైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement