కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఇవ్వాల (శుక్రవారం) రాత్రి హైటెన్షన్ నెలకొంది. రైతుల ఇష్యూపై ఆందోళన జరుగుతోంది. కాగా, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్ వద్ద రాత్రి ఆందోళన చేయడానికి వెళ్లారు. దీంతో అక్కడికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే.. అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ దశలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
- Advertisement -