Thursday, March 28, 2024

టెన్త్, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించాలి: ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సీరియస్

ఏపీలో ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇంటర్‌ పరీక్షలపై ప్రభుత్వం పున:పరిశీలన చేసుకోవాలని హైకోర్టు సూచించింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది. కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. మే 2లోపు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉండాలి కదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారని… అదెలా సాధ్యమవుతుందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్‌ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందికొవిడ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉండాలి కదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారని… అదెలా సాధ్యమవుతుందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్‌ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement