Thursday, March 28, 2024

హ్య‌పి బ‌ర్త్ డే పోస్టర్ రిలీజ్ – గ‌న్స్ ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తోన్న లావ‌ణ్య‌

2019లో విడుద‌లైన బెస్ట్ చిత్రాల‌లో మ‌త్తువ‌ద‌ల‌రా ఒక‌టి . ఈ చిత్రం త‌ర్వాత రితేష రానా రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘హ్య‌పి బ‌ర్త్‌డే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రం జులై 15న విడుద‌ల కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. మేక‌ర్స్ ఈ చిత్ర‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో లావ‌ణ్య గ‌న్స్‌ ప‌ట్టుకొని ఎగిరిన‌ట్టు ఫోజ్ ఇచ్చింది. హిట్ కోసం ఎదురుచూస్తోన్న లావ‌ణ్య‌కి ఈ చిత్రం విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement