Sunday, November 28, 2021

వరి ధాన్యంకు నిప్పంటించి రైతుల నిర‌స‌న‌

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో రైతులు వ‌రి ధాన్యంకు నిప్పంటించారు. జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో రైతులు ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై రైతులు నిప్పులు చెరిగారు. రైతు ధర్నాకు బీజేపీ నాయ‌కులు మద్దతు తెలిపారు. నెలరోజుల క్రితమే వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

సారంపల్లిలో సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై వడ్లకు నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు. వ‌ర్షాకాలం వడ్లను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింద‌ని రైతులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతుల నిరసన సెగలు తప్పవ‌ని అన్నారు. వెంటనే ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News