Friday, March 29, 2024

రైతుల సంక్షేమమే ఏకైక లక్ష్యం – మంత్రి పువ్వాడ అజయ్

★ పల్లె పల్లెనా అన్నదాత ఆనందం..

★ సీఎం తెచ్చిన సాయం సంబురం..

ఖమ్మం నియోజకవర్గంలో ఊరూరా రైతుబంధు వారోత్సవాలు, రైతు బంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరూరా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు వాకిళ్లన్నీ రంగు రంగుల ముగ్గులతో మెరిసిపోతున్నాయి. ఊరి బడి, నారు మడి, పంట కల్లం, గిరిజన గూడెం రైతు బాంధవుడికి జేజేలు పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీలకు పాలతో, ధాన్యంతో, వినూత్నంగా వివిధ విధాలుగా రైతులు అభిమానం చాటుకుంటున్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మిప్రసన్న – సాయికిరణ్ అధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జొన్నలు, పెసర్లు, మినుములు, కందులు, పత్తి, మిర్చి పలు రకాల పంటలు, పంట విత్తనాలతో తీర్చిదిద్దారు.

రైతును రాజు చేయటమే ఏకైక లక్ష్యం

- Advertisement -

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ ను పునర్నిర్మిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్‌ రైతులకు వెన్నుదన్నుగా ఉండటానికి తీసుకువచ్చిన అనేక రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ముఖ్యంగా పంటలు పండించడానికి కావాల్సిన పెట్టుబడి సాయం రైతుబంధు, 24 గంటల కరెంటును సరఫరా చేస్తూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచిందని మంత్రి పువ్వాడ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement