Sunday, April 14, 2024

గర్భస్థ శిశువులో జ్ఞానాన్వేషణ!

ఒకసారి ఏకపాదుడనే వేద పండితుడు తన శిష్యులకు బోధిస్తున్న సందర్భంలో, ఆయన భార్య సుజాత నిండు గర్భంలో ఉన్న శిశువు ”ఓ! తండ్రి! మీరు మీ శిష్యులకు పగలనక, రాత్రినక, ఎడతె రిపి లేకుండా విద్యాభ్యాసం చేయించడం వల్ల, మీరు వేదం తప్పుగా చదు వుతూ, స్వరం తప్పుతోంది. ఇది ధర్మం కాదు కదా! గమనించండి” అనే మాటలు వినపడేసరికి, ఏకపాదుడు క్రోధంతో ”నువ్వు పుట్టకుండానే, నాలోని దోషాలు ఎంచేవా డివయ్యావా? అంటూ నువ్వు అష్ట వంకరలతో జన్మించెదవు” అని శాపం ఇచ్చాడు.
తరువాత, పుట్టబోయే బిడ్డ గొప్ప పండితుడవుతాడని, గ్రహంచి, శాపానికి చింతించాడు. అలా అష్టవంకరలతో పుట్టినందుకే ”అష్టావక్రు డు” అనే పేరుతో వెలుగొందాడు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన అం గీరస మహర్షికి ఉతథ్యుడు, బృహస్పతి అనే ఇద్దరు కుమారులు. ఉత థ్యడనే మహర్షి భరతవంశపు రాజు భరతుడుకు ప్రధాన పురోహతుడు. ఆయన స్నానానికి నదికి వెళ్ళగా చూసి, తమ్ముడు బృహస్పతి- వదినగా రైన మమత వద్దకు వచ్చి దేవర న్యాయాన్ని అనుసరించి ఆమె పొందు కోరి, బలాత్కరించబోయాడు.
ఆ సమయంలో ఆమె నిండు గర్భిణి. ఈ విషయాన్ని గర్భంలో ఉన్న శిశువు గ్రహంచి ”ఇది నీకు ధర్మ వ్యతిరేకం. వదిన నీకు తల్లితో సమానం.” అని హచ్చరిస్తుంటే, బృహస్పతి క్రోధంతో ”నా అభీష్టానికి అడ్డువచ్చావు. కాబట్టి నువ్వు ”దీర్ఘ తమస్‌” గా జన్మించు” అని శాపం పెట్టాడు. దీర్ఘతమస్‌ అంటే దీర్ఘ కాలం దృష్టిలేకుండా అని. అందుకే ఆ శిశువు గ్రుడ్డిగానే జన్మించా డు. అందుకే ”దీర్ఘ తముడు” పేరుతో గొప్ప ఋషి అయ్యాడు.
పై రెండు ఉదాహరణలు చూస్తూంటే గర్భంలో ఉన్న శిశువు జ్ఞానం తో ఉంటాడనే మనం అంగీకరించాలి. భాగవతంలోని అంశం ఆధారం గా- తల్లి గర్భంలో ఉన్న శిశువుకు ఏడవ నెలలో జ్ఞానం కలుగుతుంది. మలమూత్రాదులలోని క్రిములతో కలిసిమెలిసి ఉండలేక, కడుపులో అటు-ఇటు తిరుగుతూ గర్భ వాయువులకు కంపించి పోతూ దేహాత్మ దర్శనం కలిగి విమోచనాన్ని యాచించుతూ, మళ్ళీ గర్భవాసం కలిగినం దుకు చింతిస్తూ, భయపడుతూ, బంధన రూపాలైన సప్త ధాతువులలో బందితుడై, చేతులు జోడించి దీనముఖంతో ఆ సర్వేశ్వరుని ఇలా ప్రార్థిస్తా డు. ”సర్వదా లోకాలను రక్షిం చడానికి, అవసరమైన జన్మలు ఎత్తుతూ ఉండే పరమాత్మ పాద పద్మ యుగళాన్ని అనురక్తితో, అచంచలమైన భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నాలోని భయాన్ని పటాపంచలు చేస్తా యి. ఆత్మ స్వరూపుడైన నాకు పంచభూతాలు లేవు. అయినా నేను పంచ భూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఉన్నాను.
ఇంద్రియాలు, వాటి గుణాలు తెలిసీ తెలియని జ్ఞానం కలిగి ఉన్నాను. ఏ భగవంతుడు సమస్త జీవరాశులలో- పంచేద్రియాలలో, పంచభూ తాలతో నిండిన మాయను అంగీకరించి, కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కనిపిం చుతాడో దహంచుకుపోతున్న జీవుని చిత్తంలో అవికారుడై, పరిశు ద్ధుడై, అఖండ జ్ఞాన సంపన్నుడై భాసిస్తూంటాడో ఆ ఉదాత్త చరితునకు ఆ మొక్క వోని శౌర్యం కలవానికి, ఆ సర్వజ్ఞునకు, ఆ శాంతిమూర్తికి భరింప రాని, భరిం చలేని, ఈ గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగిం చమని నమస్కరిస్తున్నాను.
దైన్యంతో నిండిన ముఖంతో గర్భ నరకం నుంచి బయట పడాలని భావి స్తూ ,నెలలు లెక్కించుకొంటూ, ఈ గర్భం నుంచి వెలువరించే వాళ్ళు ఎవరు న్నారు? కనుక. దీనులను రక్షించే పుండరీకాక్షుడు తప్ప. అటు వంటి శ్రీహరిని వేడుకొంటున్నాను. ఆ పరమాత్మకు నేనేమివ్వగలవా డను? నమస్కారం తప్ప. బయట పడిన తరువాత దేవమాయలకు లోనై- వ్యామోహంతో, భయంకరమైన సంసార వలయంలో చిక్కుకొని పరిభ్రమిస్తూ ఉండవలసిం దే. అందుకే కమల నాథుని చరణ కమలాలను ఆశ్రయిస్తాను.” అని పరిపరి విధాలుగా తలపోస్తూంటాడు. దీనుల మీద దయ చూపే ఏ పరమాత్మ నాకీ పూర్వ జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ పరమాత్మనే తిరిగి ఈ సంసారంలో పడవే యకుండా, ముక్తి మార్గాన్ని కోరుతూన్నాను. స్వామి! నేను ఈ గర్భ వాసం నుంచి బయటకు రాకూ డదని కూడా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూంటుంది.
ఎందుకంటే ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ గర్భవాస నరకాన్ని అను భవించాను. జన్మించిన ప్రతీసారీ పాపాలు చేస్తూ నీ పాదాల మీద భక్తిప్రప త్తులు లేకుండా ఉండే కన్నా ఈ గర్భవాసం ఎంతో భాధపెట్టినప్ప టికీ, నేను ఇక్కడే ఉండి నీ పాదపద్మాలను నమ్ముకొని కష్టమంటే ఏమిటో తెలియకుండా గడిపేస్తాను. తిరిగి సంసారబంధంలో చిక్కుకోకుండా, నా ఆత్మను ముక్తి పథంవైపు పయనించేలా చేస్తాను.” అంటూ ఏడుస్తూ, భగవంతుని ప్రార్థిస్తా డు. అనంతరం తల్లి గర్భంలో నుంచి భూమి మీద కు వస్తూనే — ”ఎందుకు తండ్రీ! మళ్ళీ ఈ భూమి మీద పడవేసావు? తం డ్రీ!” అని ఏడుస్తూ వస్తా డు.అంటే గర్భస్థ శిశువు లోపల జ్ఞానంతో ఉన్నా, బయటకు వచ్చేసరికి మా య వల్ల ఏమీ తెలియని శిశువులా ఉంటాడు. నిజమా? శిశువు లోపల అంత జ్ఞానంతో ఉంటాడా? అని ఆశ్చర్యం కల గవచ్చు.
”గర్భే వ్యాదే శ్మశానేచ పురొణయా మతిర్భవేత్‌
సాయాది స్థిరతాం యాతికో సముచ్యతే బంధనాత్‌||
అంటే గర్భంలో ఉన్నప్పుడున్న జ్ఞానము జన్మించిన తరువాత ఉండదు. అనారోగ్యాల సమయంలో, శ్మశానానికి వెళ్ళినప్పుడు, గీత- పురాణాలు విన్నప్పుడు, ఈ సంసారం అంతా మిథ్య అని భావన కలిగి నప్పుడు ఏర్పడే వైరాగ్యంలో ఈ జ్ఞానం గుర్తుకు వస్తుంది. అందుకే జన న-మరణ చక్రంలో చిక్కుకోకుండా ముక్తి మార్గం వైపు పయనించడమే మన కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement