Wednesday, December 6, 2023

ప్రాపంచిక వాసనల ప్రభావం

సంసారం జీవితం గడుపుతూ భగవంతుణ్ణి కనుగొనడం చాలా కష్టం. సాధకుడైన వాడు అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశానికి వెళ్లి సాధన చెయ్యాలి. చెట్టు పెద్దదయి న తరువాత దానికి ఏనుగునైనా కట్టివేయవచ్చు గాని మొక్క లేతదయితే దానిని పశువులు సులభంగా తినివేస్తాయి కదా!
సుప్రసిద్ధుడైన కేశవ చంద్రసేను తన అనుచరులతో సహా ఒకసారి దక్షిణశ్వరం వచ్చి శ్రీరామకృష్ణుల సాంగత్యంలో చాలాసేపు గడిపాడు. రాత్రి 10 గంటలయింది. కేశవుని అను చరులకు ఆ రాత్రి అక్కడే గడపాలని ఉంది. గురుదేవులు కూడా అందరినీ ఆ రాత్రి అక్కడే ఉండమని కోరారు. కాని కేశవుడు మాత్రం, ”కాదండీ! నేను ఈ రాత్రి వెళ్లక తప్పదు. నాకు చెయ్యవలసిన పని కొంచెం మిగిలివుంది.” అన్నాడు. అప్పుడు శ్రీ రామకృష్ణులు, ”అదేమి టి? నీ చేపల బుట్ట లేకపోతే నీకు నిద్ర పట్టదా ఏమిటి? ఒక కథ చెబుతాను విను!” అని ఈ కథను చెప్పారు.
”ఒకసారి ఒక బెస్త పడుచు చేపలు అమ్మడానికి పట్నం వచ్చింది. చేపలన్నీ అమ్ముడు పోయే సరికి చీకటి పడింది. ఆ చీకటిలో తన గ్రామానికి తిరిగి వెళ్లలేక ఆ రాత్రి గడపడానికి తన స్నేహతురాలింటికి వెళ్ళింది. ఆ స్నేహతురాలు ఒక పూల వ్యాపారి. ఆమె ఈ బెస్తపడు చును పూలు ఉంచిన గదిలో పడుకోబెట్టింది. కాని ఆ పూల పరిమళము వల్ల బెస్త వనితకు చాలాసేపు నిద్రపట్టలేదు. ఆ పూలవ్యాపారి ఆమె అవస్థను కనిపెట్టి, ”అదేమిటమ్మా! అటు ఇటు దొర్లుతున్నావు! నిద్రపట్టడం లేదా?” అని అడిగింది. ఆ బెస్త వనిత ”కారణమేమిటో తెలియడం లేదమ్మా! బహుశా ఈ పూల ‘కంపు’ వల్లనే నాకు నిద్రపట్టడం లేదు కాబోలు. దయచేసి నా చేపల బుట్ట కాస్త తెచ్చిపెడతావా? అది దగ్గరవుంటే నిద్రపడుతుందేమో!” అన్నది. అప్పుడు ఆ స్నేహతురాలు ఆ చేపల బుట్ట తెచ్చి ఇచ్చింది. అప్పుడు బెస్త వనిత ఆ బుట్ట మీద నీళ్లు చిలకరించి ముక్కుకు దగ్గరగా పెట్టుకుని పడుకుంది. వెంటనే మైమరచి, గురకపెడుతూ రాత్రంతా నిద్రపోయింది.”
సంసారం చేపల బుట్ట లాంటిది. ప్రాపంచికులు దాన్ని వదిలి ఉండలేరు. ఒకవేళ ఒక్క రోజైనా వదల వలసి వస్తే నిశ్చింతగా ఉండలేరు. అలవాట్ల ప్రభావం అటువంటిది. చేపల వాసన అనే ఐహక వాసనకు అలవాటు పడిపోయిన మనిషికి పూల పరిమళం అనే ఆధ్యాత్మి క వాసన నచ్చదు. ఒకవేళ ఎప్పుడైనా ఆధ్యాత్మిక వాసన కలిగిన చిత్త చాంచల్యం వల్ల తిరిగి ఐహక సంపర్కంలో పడిపోతాడు. ఈ ప్రాపంచిక వాసనలే అనర్ధాలకు మూలం. అందుకు ఉదాహరణగా మరొక కథను శ్రీ రామకృష్ణులు, విజయకృష్ణ గోస్వామికి వివరిస్తున్నారు.
ప్రాపంచిక విధులు, వాటితోబాటు ఆందోళనను, చికాకును తెస్తాయి. భాగవతంలో అవదూతకు 24మంది గురువులు ఉన్నారని చెప్పబడింది. వారిలో ఒకరు గ్రద్ద. ఆ గ్రద్ద కథ చెబుతాను అంటూ ఒక ఊరిలో ఒక రోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రివ్వున క్రిందికి వచ్చి ఒక చేపను తన్నుకు పోయింది. గ్రద్ద నోటిలో చేప కనపడేసరికి, కాకులు గుంపులు గుంపులుగా, కావుకావుమని గోలపెడుతూ దాని వెంట పడ్డాయి. ఆ గ్రద్ద ఎటుపోతే అటు కాకులు కూడా ఎగిరాయి. తూర్పుకు వెడితే తూర్పుకు, పడమరకు వెడితే పడమరకు, ఉత్తరం వైపు వెడితే ఉత్తరం వైపు వెంబడించాయి. గ్రద్ద దక్షిణం వైపు ఎగిరితే అవికూడా దక్షిణం వైపు తరుముతూ వెళ్లాయి. అటు ఇటు ఎగురుతున్న గందరగోళంలో గ్రద్ద నోటిలోనుంచి చేప జారి క్రింద పడిపోయిం ది. తక్షణమే కాకులన్నీ గ్రద్దను వదిలి చేప కోసం పరుగెత్తాయి. ఈవిధంగా చికాకులో నుండి బయటపడిన ఆ గ్రద్ద ఓ చెట్టు కొమ్మమీద వాలి నిశ్చింతగా ఇలా ఆలోచించింది: ఛీ! నికృష్ట మైన ఆ చేప ఈ అనర్ధాలన్నిటికీ మూలం! అది వదిలి పోయేసరికి నాకు మనశ్శాంతి లభించింది.”
ఈ విధంగా చెబుతూ గురుదేవులు, ”ఎంతవరకైతే మనుష్యుని వద్ద ఆ చేప అనే ప్రాపం చిక వాసనలు ఉంటాయో అంతవరకు అతడు అనేక కష్టాలు పడుతూ, వాటివల్ల ఎంతో ఆందోళన, అశాంతి చెందుతాడు. ఎప్పుడు తన కోర్కెలను వదలిపెడతాడో, ఆ క్షణం నుండే అతడు ఆత్మ శాంతిని అనుభవిస్తాడు. స్వార్ధం లేకుండా పని చెయ్యడం మంచిదేగాని, తెలి యకుండా ఎక్కడినుండో స్వార్ధంలోనికి ప్రవేశిస్తుంది మనిషిని కష్టాలలో పడవేస్తుంది. కానీ ఆధ్యాత్మిక సాధన చేసి, భగవత్సాక్షాత్కారం పొందినవాడు సులభంగా నిస్వార్ధ సేవ చేయ గలుగుతాడు. కష్టాల పాలవకుండా ఉంటాడు. ఇతరులకు నిజంగా మేలు చేయగలుగు తాడు” అన్నారు.
జీవుని వెంట వచ్చేవి రెండే రెండు. ఒకటి సూక్ష్మ శరీరము. రెండు ఆ సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న అతని కర్మల వాసనలు. ఈ వాసనలు, సంస్కారములు శుద్ధంగా ఉంటే, మంచి జన్మ వస్తుంది. ఈ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచజన్మ లభిస్తుంది. మనం మరు జన్మ ఏది పొందాలో అది మన చేతిలోనే ఉంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. మనసు, ఇంద్రియముల సూక్ష్మతత్వాలు తప్ప మనతో పాటు గడ్డిపరక కూడా రాదు, బంధువులు, మిత్రులు, భార్య బిడ్డలు, శ్మశానం దాకా వస్తారు. ధనము, ఆస్తులు, ఏవీ వెంటరావు. అవి అతని మరణాన్ని ఆపలేవు. అతనికి మంచి జన్మ ఇవ్వలేవు. కేవలము మనస్సు, ఇంద్రియ తత్వములు వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని మరుజన్మను నిర్ణయిస్తాయి.
ఈ విషయాన్ని సులభంగా అర్ధం కావడానికి ఒక ఉదా#హరణ చెప్పాడు పరమాత్మ. వాయువు అంతటా వీస్తూ ఉంటుంది. ఆ వాయువులో పూల మీది నుండి మంచి వాసనలు, మలిన పదార్ధముల నుండి చెడు వాసనలు చేరుతూ ఉంటాయి. ఆ వాసనల ప్రభావం వా యువుకు అంటదు. వాయువు ఈ మంచి వాసనలు, చెడు వాసనలు తన వెంట ఎలా తీసు కొని పోతుందో, సూక్ష్మ దేహం కూడా తన వెంట మానవుడు తన జీవిత కాలంలో తన మన సు, ఐదు ఇంద్రియ సూక్ష్మతత్వములు, ఆ ఐదు ఇంద్రియములతో చేసిన కర్మల వలన కలి గిన వాసనలను తన వెంట తీసుకొనిపోతాడు. వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు. అంటే కేవలం మంచి వాసనలను మా త్రమే తీసుకొని, చెడు వాసనలు ఇక్కడే వదిలిపెట్టదు. అన్ని వాసనలను తన వెంట తీసుకొని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనం అందరం ఈ విషయాన్ని చక్కగా అవ గాహన చేసుకొని, మనసుతో, ఇంద్రియాలతో మంచి కర్మలు చేస్తే, నిష్కామ కర్మలు చేస్తే, తన వెంట మంచి వాసనలు తీసుకొనిపోయి మంచి జన్మ పొందగలడు.
అన్నింటికీ మించి, మనం ఏ గురువును ఆశ్రయించినా, ఆయన ఆ దేహానికే పరిమితం కాదనీ, విశ్వంలోని అణువణువూ వ్యాపించియున్నాడని, తనతోపాటు ప్రతి జీవిలోనూ ఆ గురుతత్త్వమే చైతన్యంగా భాసిల్లుతున్నదన్న వివేకాన్ని కలిగివుండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement