Thursday, April 25, 2024

యాచ‌కుడే క‌దా అనుకుంటున్నారా.. రూ.5కోట్ల విలువ చేసే ఇల్లు ఉందండోయ్

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి ఓ యాచ‌కుడు.. అయితే యాచ‌కుడే క‌దా అని తీసిపారేయ‌కండి..ఇత‌నికి ఏకంగా రూ.5కోట్ల విలువ చేసే ఇల్లు ఉందంటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌న‌వంతు అవుతుంది. పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకుంటాడు ఈయ‌న‌.. ఈయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. కానీ, లండన్‌లో డామ్‌ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది. ఈ ఇంటి నుండి నెలకు రూ.1.27 లక్షల ఆదాయం కూడా వస్తుంది. బిక్షం ద్వారా రోజుకు రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తున్నానని డామ్‌ చెప్పారు. తనకు కొడుకు పుట్టాక తన తండ్రి ఈ ఇల్లును కొన్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement