Thursday, October 10, 2024

Devara Ticket Price | తెలంగాణలో దేవ‌ర టికెట్ రేట్లు ఇలా !

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘దేవర’ సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్ర‌భుత‌వ్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు టికెట్ రేట్ల మీద జీవో విడుదల చేసింది. సెప్టెంబర్ 27 (శుక్రవారం) తెల్లవారుజామున ఒంటి గంట నుంచి తెలంగాణలో ‘దేవర’ బెనిఫిట్ షోలు పడతాయి.

మెత్తం 29 థియేటర్లలో 27వ తేదీ తెల్లవారుజామున 1:00 గంటలకు షోను ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది. ఆ షోల‌కు టికెట్ రేట్ మీద అదనంగా ₹100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో మల్టీపెక్స్‌లలో టికెట్ రేటు రూ.400, సింగిల్ స్క్రీన్‌లలో రూ.300 కానున్నాయి.

ఇక‌ ‘దేవర’ విడుదల తేదీన ఉదయం నాలుగు గంటల నుంచి అన్ని థియేటర్లలో షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. అయితే, సెప్టెంబర్ 27న టికెట్ రేటు మీద రూ.100 పెంచడానికి అనుమతిచ్చిన ప్రభుత్వం… మర్నాడు (సెప్టెంబర్ 28వ తేదీ) నుంచి అక్టోబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు కేవలం 50 రూపాయల పెంచడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.

దీంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటు మీద 50 రూపాయలు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వచ్చేసరికి కేవలం పాతిక రూపాయలు మాత్రమే పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు… తొమ్మిది రోజుల పాటు ఈ జీవో అమల్లో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement