Friday, February 3, 2023

Hyderabad | స్పా, మసాజ్​ పార్లర్​ పేరుతో ‘ఆ పని’.. దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్​లో స్పా, మసాజ్​ సెంటర్​ పేరుతో ‘ఆ పని’ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు దాడులు జరిపారు. కుత్బుల్లాపూర్‌లోని ఎన్‌ఎస్‌ వెల్‌నెస్‌ ఎస్‌పీఏ సెంటర్‌పై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు, కస్టమర్‌లు, ముగ్గురు మహిళా మసాజర్లను అరెస్టు చేశారు.

- Advertisement -
   

నిర్ధిష్ట సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ జి. ప్రశాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం స్పా​ సెంటర్​ ఆర్గనైజర్ అశ్విని నడుపుతున్న మసాజ్ పార్లర్‌పై దాడి చేసింది. భవన యజమాని రామకృష్ణ స్పా సెంటర్‌ను అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement