Saturday, April 20, 2024

Breaking : బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం..నాలుగు జిల్లాల‌కు ముప్పు..

ఇప్ప‌టికే భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. ప‌లు చోట్ల వ‌ర‌ద‌లు బీభ‌త్సాన్ని సృష్టించాయి. కాగా బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింద‌ని వాతావ‌ర‌ణశాఖ తెలిపింది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో పేర్కొంది. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం (పాక్షికంగా) జిల్లాలు వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement