Sunday, April 11, 2021

అమ్మవారి దేవాలయ వార్షికోత్సవం..

కాసిపేట : మండలం పెద్దనపెల్లి గ్రామ పంచాయతీ పరిది సోమగూడెం గ్రామంలోని అమ్మవారి (పోచమ్మ) దేవాలయం 3వ వార్షిక ఉత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ వేముల కృష్ణ ఆద్వర్యంలో జరిగిన ఉత్సవంలో డప్పు వాయిద్యాలు, పోతరాజు విన్యాసలతో, స్థానిక మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా దేవాలయానిక పెద్ద యెత్తున తరలివచ్చారు. అమ్మవారికి భక్తి వ్రద్దలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు ముట్టచెప్పారు. అనంతరం దేవాలయ పూజారులు అందించిన తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో పంచాయతీ వార్డ్‌ సభ్యులు, మహాళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News