Monday, January 30, 2023

పెద్దపల్లి జిల్లాలో.. వరద నీటిలో చిక్కుకున్న కారు

నాలుగు రోజులుగా పెద్దపెల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోతున్నాయి. వరద నీరు రాజీవ్ రహదారితో పాటు ఇతర రహదారులపై నుండి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈరోజు రాళ్లు కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇదిలాపూర్, జాఫర్ ఖాన్ పేట మధ్యలో రోడ్డుపై నుండి భారీగా వరద నీరు వెళ్తున్న సమయంలో కారు మధ్యలోకి వెళ్లి వరద నీటిలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ రాజవర్ధన్ స్తానికుల సహాయంతో కారుకు ఎలాంటి హాని జరగలేదు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీస్ అధికారులు విన్నవిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement