Saturday, April 20, 2024

డిసెంబర్ 23న రిలీజ్ కానున్న ..18పేజెస్ మూవీ

హీరో నిఖిల్ తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం కూడా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథ .. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. గీతా ఆర్ట్స్ 2 – సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కుమారి 21 F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.  గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ‘కార్తికేయ 2’ తరువాత నిఖిల్ – అనుపమ కలిసి నటించిన సినిమా కావడంతో, సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది. ఈ సినిమాతో ఈ జంట మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement