Thursday, April 18, 2024

మంచిర్యాలలో కరోనా దూకుడు.. రెండు రోజుల్లో 13 మంది మృతి

తెలంగాణలో కరోనా విలయతాండం చేస్తోంది. కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మంచిర్యాల  జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే 13 మంది మృతి చెందారు. బెల్లంపల్లిలోని  సింగరేణి ఐసోలేషన్ కేంద్రంలో నిన్న ఏడుగురు, ఈ రోజు ఆరుగురు చనిపోవడంతో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం వివిధ పీహెచ్సీలు, ప్రభుత్వాసుపత్రుల్లో 907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ బారిన పడి బుధవారం ఏడుగురు మృతిచెందారు. ఇందులో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ముగ్గురు మృతిచెందారు. భీమారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి, రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ఇద్దరు కరోనాతో మృతిచెందారు. ఈ రోజు మరో ఆరుగురు  వివిధ ప్రాంతాలకు చెందిన వారు  మృతి చెందారు. ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ సెంటర్ లో కరోనా వచ్చిన వారికి సరైన చికిత్స అందించక పోవడం సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే 13 మంది చనిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కరోనా సెంటర్లో సిబ్బందికి సరైన వైద్య సామగ్రి అందించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement