Saturday, April 20, 2024

స్విస్‌ ఓపెన్‌ ప్రి-క్వార్టర్‌ ఫైనల్లో సింధు, ప్రణయ్‌

భారత స్టార్‌ షట్లర్స్‌ పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సత్తా చాటారు. స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రి-క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. గతేడాది స్విస్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన సింధు 21-9 21-16 తో జెంజిరా స్టాడెల్మన్‌ (స్విట్జర్‌లాండ్‌)ను చిత్తు చేసింది.

తర్వాతి రౌండ్‌లో ఈ ఒలింపిక్‌ విజేత ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానీతో తలపడేందుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ 9 ర్యాంకర్‌ అయిన ప్రణయ్‌ 21-17 19-21 21-17తో ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనలిస్ట్‌ షి యు కి(చైనా)పై గెలుపొందాడు. ప్రణయ్‌ తర్వాతి రౌండ్‌లోక్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)ను ఢీ కొట్టనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement