Wednesday, April 24, 2024

విజేతలకు బహుమతుల ప్రదానం

జూలపల్లి : జూలపల్లి మండలంలోని వడ్కాపూర్‌ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రం 2 లో అంగన్వాడీ టీచర్‌ పుల్లూరి సరళ నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు చెంచ, పరుగు, బండ పరుగు, సూది దారం ఆటల పోటీలు నిర్వహించగా గెలుపొందిన మహిళ విజేతలకు సర్పంచ్‌ మహంకాళి తిరుపతి, మహంకాళి అంజయ్య బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్‌ కన్నం శారద, గెలుపొందిన మహిళలు గుమ్మడి మౌనిక, జెట్టి రమ్య, గుండేటి స్వప్న, నేరెళ్ల అనూష, గీకురు కల, రాయమల్లమ్మ తో పాటు- అంగన్వాడిలోని చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement