Wednesday, April 24, 2024

అలీబాబా పతనం..?

ఏడాది క్రితం వరకు చైనాలో తిరుగులేని వ్యాపార సామ్రాజాన్ని శాసించిన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా ఇప్పుడు తన అగ్ర స్థానాన్ని కోల్పోయాడు. చైనా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వబోయి చిక్కుల్లో ఇరుక్కుపోయిన అలీబాబా తాజాగా ఆ దేశ ధనవంతుల జాబితాలో మొదటి స్థానం నుంచి నాలుగవ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం జాక్‌ మా సంపద విలువ 55.64 బిలియన్‌ డాలర్లు. జాక్‌ మా కంపెనీ సంపద పడిపోవడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. చైనా బ్యాంకుల పనితీరును ప్రశ్నించిన అలీబాబా..బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్థత్వాన్ని వీడాలని కోరారు. చైనాలో బ్యాంకులు ఎక్కువ శాతం ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. దీంతో జాక్‌ మా వ్యాఖ్యలు చైనా ప్రభుత్వానికి ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. 37 బిలియన్‌ డాలర్ల విలువ చేసే యాంట్‌ గ్రూప్‌ ఐపీవోను అడ్డుకుంది. అంతేకాదు చైనా టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా ఆయనను పక్కనపెట్టేశారు. ఈ పరిణామాల తర్వాత జాక్‌ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కన్పించకుండాపోయారు. మరోవైపు ఆయన వ్యాపార ప్రత్యర్థులు మాత్రం భారీగా సంపదను పోగేశారు. ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం నిఘాపెట్టడమే జాక్‌ మా స్థానం దిగజారడానికి కారణంగా తలుస్తోంది. మరి ముందుముందు ఇంకెన్ని కష్టాలను అలీబాబా ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement