Monday, March 25, 2024

చంద్ర‌ముఖి2.. షూటింగ్ కంప్లీట్

చంద్ర‌ముఖి చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సంచలన విజయం సాధించింది. లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్‌ మాసంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ న‌టి కంగానా రనౌత్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమర్‌, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్‌ నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement