Typhoon Wipha | హాంగ్‌కాంగ్‌ని హ‌డ‌లెత్తిస్తున్న తుఫాన్ విఫా..

  • స్తంభించిన జన జీవనం

హాంగ్‌కాంగ్: తుఫాన్ విఫా (Typhoon Wipha) హాంగ్‌కాంగ్ (Hong Kong)ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గంటకు 167 కి.మీ. వేగంతో గాలులు (167 km per hour), భారీ వర్షాల (heavy rains) కార‌ణంగా నగరంలోని సాధారణ జీవితం పూర్తిగా స్తంభించిపోయింది.

ఇప్పటికే 400కి పైగా విమానాలు రద్దు (Flights are cancelled) అయ్యాయి. బస్సులు, పడవలు, ఇతర రవాణా సర్వీసులు ఎక్కువగా నిలిపివేయాల్సి (transport services had to be suspended) వచ్చింది. వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. మొత్తం 471 చెట్లు కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. భవనాల నిర్మాణ పనుల ప్రమాదాలు సంభవించాయి.

తుఫాన్ కారణంగా మూడు గంటల్లోనే 110 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది. ఎక్కువ వర్షం చైనా (China) భూభాగానికి దగ్గరగా ఉన్న ఉత్తర ప్రాంతాల్లో (northern areas) కురిసింది. వాతావరణ శాఖ ఇంకా వర్షాలు పడతాయని హెచ్చరిస్తోంది.

తుఫాన్ వల్ల 26 మందికి గాయాలు కావడంతో వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 253 మంది సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు.

తూర్పు చైనా సముద్రం మీదుగా పశ్చిమంగా కదులుతున్న విఫా, గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్ (Guangdong Province)లోని జుహై-జాన్‌జియాంగ్ (Zhuhai-Zhanjiang) మధ్య తీరం తాకే అవకాశం ఉంది. మకావాలో కూడా వరదల ప్రమాదం ఉందని స్థానిక అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించారు.

హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో సుమారు 80,000 మంది ప్రయాణికులు విమానాల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ సముద్ర అలల కారణంగా పడవల రాకపోకలతో పాటు ఇతర ప్రజా రవాణా కూడా ఎక్కువగా నిలిచిపోయింది.

Leave a Reply