Friday, March 29, 2024

పథకాలకు డబ్బులు లేవు.. మరి మేఘ ప్రాజెక్టుకు ఎలా?

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ మండిపడ్డారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ..  కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. రూ.38,500 కోట్లతో మొదలై.. రూ.లక్షా 20 వేల కోట్లకు చేరిందన్నారు. ఒకవైపు ఉద్యోగుల జీతాలకు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కు పైసలు లేవని, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్ముకోవాలని పేర్కొన్నారు. మేఘా ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం .. అప్పులు చేసి మరి కేసీఆర్ దొర పైసలు కుమ్మరిస్తారని ఆరోపించారు. ’’ మీది దేశంలోనే అద్భుత “మేఘ” పరిపాలన దొర గారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Third Wave: చిన్నారులపై ప్రభావం ఆరు రోజులే..!
Advertisement

తాజా వార్తలు

Advertisement