Sunday, November 28, 2021

పొర్లు దండాలు ఇప్పుడెందుకు దొరః కేసీఆర్ పై షర్మిల సెటైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మరోసారి మండిప‌డ్డారు. హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక నేప‌థ్యంలో ద‌ళితులపై ఉన్న‌ట్టుండి ఆయ‌న ప్రేమ కురిపిస్తున్నార‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు.
‘ఏడేండ్లలో ఎప్పుడూ అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని దొర ఇప్పుడు పొర్లు దండాలు పెడుతుండు. సీఎంవోలో ఒక్క దళిత ఆఫీసర్ నూ పెట్టుకోని సారు ఇప్పుడు దళిత ఆఫీసర్లని నెత్తిల పెట్టుకుంటున్నడు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చెయ్యని సారు దళిత ఓట్ల కోసం 2 వేల కోట్ల రూపాయ‌లు ఖర్చు పెట్టేందుకు సిద్దమైనడు. ఈ ప్రేమంతా హుజూరాబాద్ ఎన్నిక మహిమ. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే..  ఈ డ్రామాలు ఆపి.. ఐదేండ్ల కింద అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు హామీ ఇచ్చిన.. మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేసి.. 20 వేల మంది దళితులకు ఉపాధి చూపండి’ అని ష‌ర్మిల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News