Friday, April 19, 2024

కార్యకర్తలు చెప్పిందే నా పార్టీ సిద్ధాంతం: షర్మిల

జులై 8న పార్టీని స్థాపించబోతున్నామని వైఎస్ షర్మిల ప్రకటించారు. బుధవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నానని వైఎస్ షర్మిల వెల్లడించారు. కార్యకర్తలకే పార్టీలో పెద్ద పీట వేయబోతున్నామని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టపడే కార్యకర్తలే రేపటి నాయకులు అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు చెప్పిందే తన పార్టీ సిద్ధాంతమని షర్మిల పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.

ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా పార్టీ విధానాలుంటాయన్నారు. పార్టీ పెట్టబోయే ఈ నెల రోజులు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్​ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ఫలాలు అందని ఇళ్లు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా తమ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కోసం పాటుపడుతుందని తెలిపారు. విద్యార్థుల, రైతుల,నిరుద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని కలవాలని షర్మిల నిర్దేశించారు. ప్రజల ఆశాయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించాలని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని, ప్రతి తెలంగాణ బిడ్డ ఒప్పుకునేలా ఉండాలని షర్మిల పేర్కొన్నారు. 

మరోవైపు షర్మిల పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి సంబంధించిన కొందరిని అధికార ప్రతినిధులగా కూడా ప్రకటించారు. దివంగత్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా షర్మిల పార్టీ పేరు, విధివిధానాలు వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ పీసీసీ చీఫ్ కౌన్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement