Thursday, August 5, 2021

అన్నదాత గోస.. ఇకనైనా కళ్లు తెరవండి దొరా: షర్మిల

తెలంగాణలో పార్టీ  స్థాపించబోతున్న వైఎస్ షర్మిల.. ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. రైతుల కష్టాలపై మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక అన్నదాత గోస పడుతున్నాడని తెలిపారు. నేనూ రైతునే అని చెప్పుకునే కేసీఆర్ కు రైతుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుపై ఎందుకంత కక్ష? అని నిలదీశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు పడుతున్న కష్టాలు చూసి కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరవాలని షర్మిల హితవు పలికారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

నిన్న వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యాన్ని వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని  రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను షర్మిలకు రైతులు వివరించారు. తేమ శాతం,తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News