Tuesday, January 25, 2022

మీరా అవినీతిపై మాట్లాడేది : మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు హ‌రీశ్ రావు కౌంట‌ర్

మీరా అవినీతిపై మాట్లాడేద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు కౌంట‌ర్ వేశారు. సిద్దిపేట జిల్లా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానం గా స్పష్టంగా చెప్పార‌న్నారు. మరి మీ మధ్యప్రదేశ్ లో పెద్ద కుంభకోణం జరిగింది‌..వ్యాపం కుంభకోణం సంగతి ఏంటని ప్ర‌శ్నించారు.. ఎవరికైనా శిక్ష పడిందా..అని అడిగారు. మనుషులనే మీరు చంపేసారు.. మీ కుంటుబ‌ సభ్యుల మీద, మీ పార్టీ నేతలు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. 317 జీవో రద్దు చేయాలా‌‌…అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా అని ప్ర‌శ్నించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా.. వద్దా ? నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని సీఎం భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దని బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News