Friday, March 29, 2024

సాగేదెలా.. గత ఏడాది కంటే భారీగా తగ్గిన యాసంగి..

ఈ ఏడాది యాసంగిలో వరి సాగును వద్దని ప్రభుత్వాలు రైతులకు సూచించడంతో ఆ సూచన ప్రభావం మొత్తం యాసంగి సాగుపైనే పడింది. దీంతో ఈ సమయానికి 31.53లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన యాసంగి పంటల సాగు ఇప్పటివరకు కేవలం 19,07,465 ఎకరాల్లోనే సాగైంది. వరి వద్దని చెప్పినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికీ 7,64,319 ఎకరాల్లో వరి సాగైంది. ఇదే సమయంలో వరి స్థానంలో సాగుచేయించదల్చిన మిగతా పంటలు ఏ మాత్రం పెరగకపోవడం గమనార్హం. ఇతర పంటల సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి లేకుండా చేసిన సూచనతోనే ఆయా పంటలు సాగుకాలేదని స్పష్టమవుతోంది. ఇందుకు వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కూడా కారణంగా కనిపిస్తోంది. వరిని తగ్గించి ఇతర పంటలను సాగు చేయించదల్చిన నేపథ్యంలో వాటికవసరమైన విత్తనాలను అందుబా టులోకి తీసుకురావడంలో విత్తనాభివృద్ధి సంస్థ విఫలమైందని యాసంగి పంటల సాగులో తేటతెల్లమవుతోంది.

గత సీజన్‌ కంటే 12.50లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు..
గతేడాది యాసంగి సాగును, ప్రస్తుత యాసంగి సాగును పరిశీలిస్తే గతంలో ఈ సమయానికి అన్ని పంటలూ కలుపుకుని 31,53,433 ఎకరాల్లో సాగు కాగా, ఈ సారి మాత్రం 19,07,465 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. గత పంటలకు ప్రస్తుత పంటల సాగులో సుమారు 12,45,968 ఎకరాల్లో ఈ సారి పంటలు తగ్గా యి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించిన గణాంకాల ద్వారా తెలు స్తోంది. ఇదిలా ఉండగా గతవారం 2022 జనవరి 12న వ్యవసాయ శాఖ ప్రభు త్వానికి నివేదించిన పంటల సాగు విస్తీర్ణం వివరాలు, బుధవారం నివేదించిన వివరాలను పరిశీలించగా సాగు విస్తీర్ణంలో పెద్దగా మార్పులేకపోవడం గమనార్హం. గత వారం 15,61,055 ఎకరాల్లో పంటలు సాగకాగా బుధవారం నాటికి అది 19,07,465 ఎకరాలకు మాత్రమే పెరిగింది. దీని ప్రకారం అన్ని పంటలు కలుపుకుని కేవలం 3,46,410 ఎకరాల్లో మాత్రమే సాగు పెరిగిందని కూడా స్పష్టమవుతోంది.

పెంచాలని చూస్తున్నా.. పంటల విస్తీర్ణం పెరగట్లే..
వరి స్థానంలో ఇతర ప్రత్యామ్నాయ పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేయా లని వ్యవసాయ శాఖ భావించినా ప్రత్యామ్నాయ పంటలు పెరగడంలేదు. ఇందు లో భాగంగానే ఈ యాసంగిలో పెంచాలని భావించిన శనగ, వేరు శనగ, పెసర, మినుము, కంది తో పాటు చిరుధాన్యాల పంటలు ఏ మాత్రం ఆశించిన మేర సాగు కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుత పంటల సాగులో పెంచాలని భా వించిన వేరుశనగ ఇప్పటివరకు కేవలం 3,12,229 ఎకరాల్లోనే సాగవ్వగా, గత వా రంతో పోల్చుకుంటే కేవలం 2వేల ఎకరాల్లోనే పెంపు కనిపిస్తోంది. ఇదే బాటలో శనగ కూడా గత వారం 3,20,327 ఎకరాలుండగా, తాజా నివేదికల ప్రకారం అది 3,22, 014 ఎకరాల్లోనే సాగయింది. కాగా మొక్కజొన్న 2 వేల ఎకరాలు పెరిగి ప్రస్తుతం 2,33,559 ఎకరాల్లో, జొన్నలు 62,744 ఎకరాలు, పెసర 13,196, మినుము 66,118, పొద్దు తిరుగుడు 23,174, కుసుమ 11, 432 ఎకరాల్లోనే సాగ య్యాయి. వరిని కా కుండా చిరుధాన్యాల సాగును పెంచాలని అధికారులు భావిం చినా ఏ మాత్రం పెర గడంలేదు. వీటిలో ప్రస్తుతం రాగులు 1, 299, కొర్రలు 265 ఎక రాల్లోనే సాగయ్యాయి.

యాసంగిలో వరి పంటపై నీలినీడలు కమ్ముకోవడంతో వరి తప్ప మిగతా పంటలు పం డని భూముల్లో ఏ పంటలు వే యాలో అర్ధంకాక అన్న దాతలు అయోమయంలో ఉండి పోయారు. దీంతో మిగతా భూ ముల్లో సాగుపై సందిగ్థత నెలకొంది. అయితే ఆ భూముల్లో ఏ పంటలు సాగు చేయాలి, సాగుచేసిన పంటల మార్కెటింగ్‌ ఏంటనే దానిపై అధికారులు స్పష్టతనివ్వక పోవడంతో రైతులు అయోమయానికి గురవుతు న్నారు. మొత్తానికి యాసంగి సాగు గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సా..గుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement